– ఆమె లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదు
– కేసీఆర్ ఎంపీ అయ్యేవారే కాదు : టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
టీఆర్‌ఎస్ నిజమైన హక్కుదారు కల్వకుంట్ల కవితనే అని తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్‌ఎస్) నాయకులు తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగతి కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు ఎల్.రూప్‌సింగ్, రంగు నవీన్ ఆచారి, సయ్యద్ ఇస్మాయిల్, గొంగళ్ల రంజిత్ కుమార్, మంచాల వరలక్ష్మీ, నరేశ్ ప్రజాపతి మీడియా సమావేశంలో మాట్లాడారు. టీఆర్‌ఎస్ పేరుతో కవిత పార్టీ పేరు ప్రకటించగానే బీఆర్‌ఎస్ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఒరిజినల్, డూప్లికేట్ అంటూ చేసిన పోస్టులు పెట్టడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నవీన్ ఆచారి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సభలకు జనాన్ని సమీకరించిన వ్యక్తులపై దాడి చేయించి చంపించిన కడియం శ్రీహరిని ఉప ముఖ్యమంత్రి చేశారని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక తెలంగాణవాదాన్ని వదిలేశారనీ, తెలంగాణ జాతిపిత జయశంకర్ విగ్రహం పెట్టలేదెందుకు అని ప్రశ్నించారు. నక్సలైట్ల పేరుతో నవ యువకులు శృతి, సాగర్ లను చంపించారని గుర్తుచేశారు. రూప్‌సింగ్ మాట్లాడుతూ పెయిడ్ బ్యాచ్ ద్వారా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయాలని చూస్తే తగిన బుద్ది చెబుతామని బీఆర్‌ఎస్ నేతలను హెచ్చరించారు. రంజిత్ కుమార్ మాట్లాడుతూ 2009లో మహబూబ్ నగర్ ఎంపీగా కేసీఆర్‌ను గెలిచేందుకు కవితక్కనే కారణమన్న విషయం మీ అధినాయకుడిని అడిగి తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. కవితనే కేసీఆర్‌కు ఆస్కార్ ఫెర్నాండేజ్‌తో మాట్లాడి సోనియాగాంధీ అపాయింట్‌మెంట్ ఇప్పిచ్చారని గుర్తు చేశారు. ఆ సమావేశం ఏర్పాటు చేయించి ఉండకపోతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పరిస్థితి ఏమిటో ఉద్యమ నాయకుడిని అడిగి తెలుసుకోవాలన్నారు.
టీఆర్‌ఎస్ హక్కుదారు కవితనే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



