Monday, April 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నవాబుపేటలో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకలు

నవాబుపేటలో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ-నవాబు పేట
నవాబు పేట మండల కేంద్రంలోని ఎర్ర సత్యం చౌరస్తాలో బీఆర్ఎస్ 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల అధ్యక్షుడు మాడెమోని నర్సింహులు జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా బీఆరెస్ పార్టీ శ్రేణులు భారీగా హాజరై జెండా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పార్టీ నాయకులు మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణా రాష్ట్ర సాధనే లక్ష్యంగా బారాస పార్టీ స్థాపించారన్నారు. కేసీఆర్ నాయకత్వంల్లో తెలంగాణా రాష్ట్ర సాధన కోసం జడ్చర్ల జననేత మాజీ మంత్రి వర్యులు లక్ష్మా రెడ్డి తన పదవిని సైతం రాజునామా చేసిన త్యాగశిలి అని కొనియాడారు. ముఖ్యంగా తెలంగాణా రాష్ట్ర రావడానికి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కృషి అని పార్టీ నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో భారాస పార్టీ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -