Monday, April 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కేమ్రాజ్ కల్లాలిలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు

కేమ్రాజ్ కల్లాలిలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని కేమ్రాజ్ కల్లాలి గ్రామంలో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం గ్రామ మాజీ సర్పంచ్ సుంకరి వెంకట్ ఆధ్వర్యంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు కమ్మరి గంగాధర్ జెండా ఎగురవేశారు. ఆవిర్భావ వేడుకలలో బిఅర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు కమ్మారి గంధగధర్, మాజీ గ్రామ సర్పంచ్‌లు సుంకరి వెంకటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ సుంకరి వెంకటి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయంలో రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద బడుగు బలహీన వర్గాలకు అందించామని అన్నారు. పేదల బాపుగా కొలిచే  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే జుక్కల్ నియోజకవర్గంలో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో చిరస్థాయిగా గుర్తుండిపోయేలా సంక్షేమ పథకాలను, కార్యక్రమాలు వారు చేపట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ స్థాయి భారత రాష్ట్ర సమితి నాయకులు చెర్ల పెద్ద గంగారాం, పార్టీ కార్యకర్తలు కేసీఆర్, షిండే అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -