Monday, April 27, 2026
E-PAPER
Homeహైదరాబాద్జినీవా స్టేట్ మ్యూజియంను సంద‌ర్శించిన లూయిస్ మోన్రియల్

జినీవా స్టేట్ మ్యూజియంను సంద‌ర్శించిన లూయిస్ మోన్రియల్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: వారసత్వ శాఖ (పూర్వస్తు మరియు ప్రదర్శనశాలల శాఖ) 112 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా..ఆగా ఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ డైరెక్టర్ జనరల్ లూయిస్ మోన్రియల్ జినీవా స్టేట్ మ్యూజియంను సోమ‌వారం సందర్శించారు. ఈ సందర్భంగా, మ్యూజియం భవన నిర్మాణం సంరక్షణ, అంతర్గత డిజైన్, ల్యాండ్‌స్కేపింగ్ విషయాల గురించి సంబంధిత అధికారులతో చర్చించారు. అదేవిధంగా, మ్యూజియంలో ప్రదర్శించిన అన్ని పురాతన వస్తువుల గురించి వివరాలు తెలుసుకున్నారు.

ఆగా ఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ డైరెక్టర్ జనరల్, స్టేట్ మ్యూజియం సంరక్షణ (కన్సర్వేషన్)పునరుద్ధరణ (రెస్టారేషన్) కోసం తమ సాంకేతిక సలహాలు, ఆర్థిక సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. “ఇంత విలువైన సాంస్కృతిక సంపదను భవిష్యత్ తరాలకు అందించడానికి, మా బృందం సాంకేతిక, ఆర్థిక సలహాలతో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది” అని తెలిపారు.

1975 నుంచి 2014 వరకు 100కు పైగా తవ్వకాలలో పాల్గొని అమూల్య సేవలందించి రిటైర్ అయిన సీనియర్ కేర్‌టేకర్ ఏ.భానుమూర్తిని సత్కరించారు. డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జున్ రావు కుతాడి గారి ఆధ్వ‌ర్యంలో ఆయ‌కు సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో డెప్యూటీ డైరెక్టర్ పి. నాగరాజు, అసిస్టెంట్ డైరెక్టర్ మల్లునాయక్, ఓఎస్‌డి రాజు తదితర వారసత్వ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -