నవతెలంగాణ-ఆర్మూర్
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా డివిజన్ పరిధిలో భరోసా సెంటర్ ఆధ్వర్యంలో చైల్డ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం మంగళవారం మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 70 మంది ఎం.పి.హెచ్.డబ్ల్యూ విద్యార్థినులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డబ్ల్యూఎస్ఐ పుష్పావతి మాట్లాడుతూ.. ఈ సందర్భంగా మహిళల భద్రత, బాలల రక్షణ, లింగ సమానత్వం, పితృస్వామ్యం, జెండర్ బైయాస్, సైబర్ నేరాల నివారణ, బాల్య వివాహాల నిర్మూలన మరియు భరోసా సెంటర్ సేవలపై అవగాహన కల్పించారు.
మహిళలు, బాలికలు తమ హక్కులపై అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని, పితృస్వామ్య భావనలు, జెండర్ వివక్షను గుర్తించి ఎదుర్కోవాలని, సైబర్ మోసాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, బాల్య వివాహాల నివారణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఈ సందర్భంగా పాల్గొన్న అధికారులు ఇలాంటి అవగాహన కార్యక్రమాలను గ్రామ స్థాయిలో మరింత విస్తరించాల్సిన అవసరాన్ని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై అప్పారావు, డి ఎం ఇందర కోఆర్డినేటర్ రాజా, సపోర్టు పర్సన్స్ సవిత ,మౌనిక తదితరులు పాల్గొన్నారు.



