Wednesday, April 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసీఎం ప్రజావాణిలో 325 దరఖాస్తులు

సీఎం ప్రజావాణిలో 325 దరఖాస్తులు

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో మం గళవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 325దరఖాస్తులు అందాయి. పంచా యతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 92, రెవెన్యూశాఖకు సంబం ధించి 40, ఇందిరమ్మ ఇండ్లకోసం 106దరఖాస్తులు వచ్చా యి. ఇతరశాఖ లకు సంబంధించి 87 దరఖాస్తు లందాయి. సీఎం ప్రజావాణి ఇన్‌చార్జ్‌, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌చైర్మెన్‌ డాక్టర్‌ జీ చిన్నారెడ్డి దరఖాస్తులు స్వీకరించి సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పలు సమస్యలను పరిష్కరిం చారు.కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ సూర్యప్రకాష్‌, ఏసీపీ ఉమేందర్‌, ఎన్‌ఆర్‌ఐ సలహామండలి వైస్‌చైర్మెన్‌ మంద భీంరెడ్డి, ప్రవాసి ప్రజావాణి సమ న్వయకర్త బొజ్జా అమరేందర్‌ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

భవిష్యత్‌ను కాపాడండి : విద్యార్థుల విజ్ఞప్తి
దూర విద్య విధానంలో చదువుకున్న 1.24 లక్షల మంది భవిష్యత్తును కాపాడాలని మంగళ వారం సీఎం ప్రజావాణిలో విద్యార్థులు విజ్ఞప్తి చేశా రు. ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి రాష్ట్ర విభజన చట్టం 2014 సెక్షన్‌ 95 ప్రకారం ఏపీకి చెందిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నిర్వహించిన దూరవిద్య విధానం ద్వారా వివిధ కోర్సులు పూర్తి చేసుకున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన 1,24,524 మంది భవిష్యత్తును కాపాడాలని విద్యార్థులు ప్రజావాణి ఇన్‌చార్జి జీ చిన్నారెడ్డిని కోరారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు ఆయా యూనివర్సిటీల ద్వారా ఇరురాష్ట్రాల్లో దూర విద్యవిధానం ద్వారా విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించి వివిధ కోర్సులను పూర్తిచేసుకునే అవకాశా న్ని కల్పించాయని తెలిపారు.తద్వారా డిగ్రీలు, పీజీ లు పూర్తిచేసుకున్న తెలంగాణ విద్యార్థులకు 2021 వరకు వివిధ శాఖల్లో ఉద్యోగాలు లభించా యన్నారు. 2022లో తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఏపీకి చెందిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య ధృవపత్రాలు అంగీకరించబో మని చెప్పడంతో కోర్టును ఆశ్రయించామని తెలి పారు. హైకోర్టు తీర్పు కూడా తమకు అనుకూలం గా వచ్చినా ఉద్యోగ అవకాశాలకు సంబంధించి సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నారు.దీంతో తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థుల భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారిందని విద్యార్థులు ఆందోళన వ్యక్తంచేశారు. దీనిపై చిన్నారెడ్డి స్పందిస్తూ విద్యా శాఖ, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఉన్నత అధికారులతో మాట్లాడారు.అనంతరం విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -