Monday, June 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకేయూ మెస్‌లో పురుగుల ‘ఉప్మా’

కేయూ మెస్‌లో పురుగుల ‘ఉప్మా’

- Advertisement -

విద్యార్థుల ఆందోళన
నవతెలంగాణ – హనుమకొండ చౌరస్తా

ఉప్మాలో పురుగులు కనిపించడంతో విద్యార్థులు ఆందోళనకు గురైన ఘటన హనుమకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ(కేయూ) మెస్‌లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… కేయూలో రోజు మాదిరిగానే ఆదివారం ఉదయం టిఫిన్ కోసం కామన్ మెస్ వద్దకు వెళ్లారు. నిర్వాహకులు ఉప్మా పెట్టగా కొందరికి పురుగులు వచ్చాయి. దాంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. యూనివర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని విద్యార్థులు వాపోయారు. ఇప్పటికే మెస్ నిర్వహణలో అనేక లోపాలు ఉన్నాయని, సరిపడా భోజన సదుపాయాలు లేవని, నాన్-బోర్డర్స్ కూడా మెస్‌ను వినియోగించడం వల్ల అసలు హాస్టల్ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. విద్యార్థుల నుంచి హాస్టల్ డిపాజిట్‌లు, ఇతర ఫీజుల రూపంలో వేల రూపాయలు వసూలు చేస్తున్న యూనివర్సిటీ పాలకులు.. కనీసం నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించడంలో విఫలమవడం శోచనీయమని వాపోయారు. వెంటనే మెస్ నిర్వహణపై సమగ్ర విచారణ చేపట్టి, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులతోపాటు విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -