Thursday, April 30, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఒక్క నెలలోనే 46,000 ఉద్యోగాలు ఫట్‌

ఒక్క నెలలోనే 46,000 ఉద్యోగాలు ఫట్‌

- Advertisement -

టెక్‌ రంగంలో గడ్డుకాలం..తీవ్ర ఆందోళనలో టెకీలు
న్యూఢిల్లీ
: ఐటీ ఉద్యోగాలు గాల్లో దీపంలా మారాయి. గ్లోబల్‌ టెక్‌ కంపెనీలు భారీ పొదుపు చర్యలు, కృత్రిమ మేధ (ఏఐ)లో పెట్టుబడుల్లో భాగంగా వేలాది మంది ఉద్యోగులను అర్ధంతరంగక్క నెలలోనే
46,000 ఉద్యోగాలు ఫట్‌ రోడ్డున పడేస్తున్నాయి. ఈ క్రమంలోనే గడిచిన రెండేండ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా మార్చి 2026లో భారీ స్థాయిలో ఉద్వాసనలు నమోదయ్యాయి. కేవలం ఒకే నెలలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 45,800 మంది టెక్‌ ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఎఐ దిశగా కంపెనీలు తమ ప్రాధాన్యతలను మార్చుకోవడమే ఈ భారీ కోతలకు ప్రధాన కారణంగా కనిపిస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం టెక్‌ దిగ్గజాల మధ్య ఏఐ రంగంలో ఆధిపత్యం కోసం తీవ్ర పోటీ నెలకొంది. మైక్రోసాఫ్ట్‌, మెటా, ఆల్ఫాబెట్‌, అమెజాన్‌ వంటి సంస్థలు ఈ ఏడాది సుమారు 674 బిలియన్‌ డాలర్లను ఏఐ మౌలిక సదుపాయాలు, డేటా సెంటర్లు, చిప్స్‌ కోసం వెచ్చించాలని నిర్ణయించుకున్నాయి.

ఈ భారీ వ్యయాలను భర్తీ చేసుకునే క్రమంలో భాగంగా కంపెనీలు తమ నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగుల సంఖ్యను కుదిస్తున్నట్టు తెలుస్తోంది. గడిచిన మార్చిలో ముఖ్యంగా మెటా సంస్థ 8,000 మందిని, ఒరాకిల్‌ సుమారు 30,000 మందిని తొలగించగా, మైక్రోసాఫ్ట్‌ తన అమెరికా సిబ్బందికి స్వచ్ఛంద విరమణ ప్యాకేజీలను ప్రకటించింది. ఒరాకిల్‌ ఉద్వాసనల్లో 12,000 మంది భారతీయులు ఉన్నారు. మరోవైపు ఫిన్‌టెక్‌ సంస్థ బ్లాక్‌ ఏకంగా తన వర్క్‌ఫోర్స్‌లో 40 శాతాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ పరిణామాలు టెక్‌ నిపుణుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అనుభవజ్ఞులైన ఇంజనీర్లు స్టార్టప్‌ల వైపు వెళ్లడం లేదా సొంతంగా కంపెనీలు పెట్టుకోవడం వంటి మార్పులు జరుగుతున్నాయి. మరోవైపు ఏఐ సాంకేతికత కొత్త ఉద్యోగాలను సృష్టించడం కంటే ఉన్న ఉద్యోగాలను హరించడమే ఎక్కువగా చేస్తోందన్న ఆందోళన సామాజికంగా, రాజకీయంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. పరిశ్రమలో ఈ అనిశ్చితి మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -