నవతెలంగాణ-గండిపేట్
హైదరాబాద్ గౌలిదొడ్డి గురుకులం బాలికలు టెన్త్‌లో రాష్ట్రస్థాయిలో ఫలితాలు సాధించారని జిల్లా డీసీఓ కల్పన తెలిపారు. బుధవారం ఆమె పది ఫలితాలు సాధించిన విద్యార్థుల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గౌలిదొడ్డి బాలికల సీఓఈలో 76 మంది పరీక్షకు హాజరుగా 76 మంది పాస్ అయినట్టు తెలిపారు. రాష్ట్రస్థాయిలో అత్యధికంగా కె.స్వేచ్చదాస్ 584, కె.తులసి 583 మార్కులను సాధించినట్టు తెలిపారు. మంచి నాణ్యమైన విద్యను అందిస్తూ క్రమశిక్షణతో కూడిన బోధన ఇవ్వడంతో రాష్ట్రస్థాయిలో గౌలిదొడ్డి గురుకులానికి మంచి పేరు ఉందని చెప్పారు. ప్రతిసారీ అదే బాటలో నడిచేందుకు పేదింటి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో ముందుకెళ్తామన్నారు. ఈ ఫలితాలను సాధించేందుకు కృషి చేసిన ఉపాధ్యాయులు, గురుకుల విద్యాలయ సంస్థ ఉన్నతాధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు.
గౌలిదొడ్డి గురుకులంలోరాష్ట్ర స్థాయి ఫలితాలుజిల్లా డీసీఓ కల్పన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



