Thursday, April 30, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకుల వ్యవస్థ నిర్మూలన లేకుండా సమానత్వం అసాధ్యం

కుల వ్యవస్థ నిర్మూలన లేకుండా సమానత్వం అసాధ్యం

- Advertisement -

బహుముఖ పోరాటాలతోనే కులరహిత సమాజం :
కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌ బాబు
నవతెలంగాణ-ఖమ్మం

కుల వ్యవస్థ నిర్మూలన జరగకపోతే మానవ సమానత్వం సాధ్యం కాదని, సమానత్వం లేకుండా సోషలిస్ట్‌ వ్యవస్థ ఏర్పడదని కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు తెలిపారు. మతాలు, పాలకులు మారినా దేశంలో కులవ్యవస్థ మాత్రం మారలేదన్నారు. ఖమ్మం నగరంలోని రమణగుట్ట ప్రాంతంలో కేవీపీఎస్‌ జిల్లా అధ్యక్షులు ముత్తమాల ప్రసాద్‌ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన ”కులరహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాల” ముగింపు కార్యక్రమంలో స్కైలాబ్‌బాబు మాట్లాడారు. కుల వ్యవస్థ నిర్మూలన కోసం బహుముఖ పోరాటాలు అవసరమని, ఇందుకు అన్ని సంఘాలు ఐక్యంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. సమాజంలో కులం వేళ్లు లోతుగా వ్యాపించి ఉన్నాయని, ప్రజల మనసుల నుంచి కుల భావజాలాన్ని తొలగించడం అంత సులభం కాదని చెప్పారు. కులవ్యవస్థ వల్ల కార్మికులు, రైతులు విభజింపబడి భూస్వాములు, యజమానులు లాభపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కులం తనంతట తాను పోదని, దాన్ని నిలబెట్టే భావజాలాన్ని చెరిపేయాల్సిన అవసరం ఉందన్నారు. సాంస్కృతిక రంగం కుల వ్యవస్థ నిర్మూలనలో కీలక పాత్ర పోషించాలని, అందుకు జానపద కళలను వినియోగించాలని సూచించారు.
కేవీపీఎస్‌ జిల్లా ఉపాధ్యక్షులు మాచర్ల భారతి మాట్లాడుతూ.. కులరహిత సమాజాన్ని వ్యతిరేకించే శక్తులను ఓడిస్తేనే కుల వ్యవస్థ నిర్మూలన సాధ్యమవుతుందని తెలిపారు. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉన్న శక్తులన్నీ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కేవీపీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్‌ మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రత్యక్షంగా, పట్టణాల్లో పరోక్షంగా కుల వివక్ష కొనసాగుతోందన్నారు. కులరహిత సమాజం కోసం కమ్యూనిస్టులు, ప్రగతిశీల శక్తులు కలిసి రావాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీలు పేదలు, దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రజా, సామాజిక సంఘాల నాయకులు బండి రమేష్‌, మెరుగు సత్యనారాయణ, యర్రా శ్రీనివాసరావు, విష్ణు, బండారు రమేష్‌, పారుపల్లి జాన్సీ, బోడపట్ల సుదర్శన్‌, కోరిపల్లి శ్రీనివాస్‌, కత్తి నెహ్రూ, పివి.సిద్ధార్థ, పాగి వెంకన్న, పమ్మి రవి, కొమ్ము శ్రీను, పాపిట్ల సత్యనారాయణ, నకరికంటి చిరంజీవి, కర్లకుంట నరేష్‌, గుమ్మడి భిక్షం, సత్యం పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -