Thursday, April 30, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంగిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలో 98.86 శాతం ఉత్తీర్ణత

గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలో 98.86 శాతం ఉత్తీర్ణత

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఎస్‌ఎస్‌సీ పరీక్ష ఫలితాలు 2025-26లో అద్భుతమైన ఫలితాలు సాధించింది. విద్యాపరమైన నైపుణ్యం, విద్యార్థుల విజయానికి తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. 98.86 శాతం ఉత్తీర్ణత నమోదు చేసింది. ఇది గతేడాది కంటే 0.78 శాతం ఎక్కువ. 84 విద్యాలయాల్లో 66 స్కూళ్లు 100 శాతం ఫలితాలు సాధించాయి. సిర్పూర్‌-1, కుమరం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లాకు చెందిన బి.అక్షయ 587 మార్కులు సాధించారు. 90 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు 534 మంది ఉన్నారు. 75 శాతం కంటే ఎక్కువవగా 4,047 మందికి వచ్చాయి. ఈ అద్భుతమైన ఫలితాలు సాధించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, నిర్వాహకుల ప్రశంసనీయమైన పనితీరును సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -