Thursday, April 30, 2026
E-PAPER
Homeతాజా వార్తలువి. హనుమంతరావుకు ప్రభుత్వ కీలక బాధ్యతలు

వి. హనుమంతరావుకు ప్రభుత్వ కీలక బాధ్యతలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావుకు తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయనను రాష్ట్ర మంత్రి హోదాతో ప్రభుత్వ బీసీ సంక్షేమ శాఖ అభివృద్ధి సలహాదారుగా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. వీ.హెచ్ కు నెలకు రూ. 1,00,000 వేతనం ప్రభుత్వం చెల్లిస్తుంది. ఒకవేళ ప్రభుత్వ క్వార్టర్ కేటాయించని పక్షంలో, నెలకు రూ. 50,000 ఇంటి అద్దె పొందే వీలుంది. ప్రభుత్వ పనులకు సొంత వాహనాన్ని ఉపయోగిస్తే నెలకు రూ. 30,000 కన్వేయన్స్ అలవెన్స్‌తో పాటు, రూ. 15,000 ఇంధన ఖర్చులను ప్రభుత్వం భరిస్తుంది. దీనికి అదనంగా డ్రైవర్‌తో కూడిన ప్రభుత్వ వాహనాన్ని పొందే వెసులుబాటు ఆయనకు ఉంటుంది. అఖిల భారత సర్వీసు అధికారులు, మంత్రులతో సమానంగా వైద్య ఖర్చుల రీయింబర్స్‌మెంట్ సౌకర్యం కూడా వీహెచ్‌కు వర్తిస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -