అందుబాటులో ఉండని కార్యదర్శి
బిఆర్ఎస్ నాయకుల ఆరోపణ
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఆన్సాన్పల్లి గ్రామ ప్రజల సమస్యలను వినేదేవరుని బిఆర్ఎస్ నాయకులు బానోతు రాజ్ కుమార్ (ఢిల్లీరాజు), తొట్ల సమ్మయ్య, గుగులోతు రాజు గురువారం ఒక సంయుక్త ప్రకటనలో ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో తాగునీటి, పారిశుధ్య సమస్యలు, ధ్రువీకరణ పత్రాలు పొందడానికి పంచాయతీ కార్యాలయం వద్దకు వెళ్ళితే ఎప్పుడు కార్యదర్శి అందుబాటులో ఉండటం లేదని చెప్పారు.
అసలు గ్రామానికి కార్యదర్శి ఉన్నట్లా.?లేనట్టా.? అని గ్రామ ప్రజలు అయోమయానికి గురివుతున్నట్లుగా వాపోయారు. జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న గ్రామపంచాయతీలో సమస్యలు విన్నవించుకుందాం అంటే ప్రజల సమస్యలు వినేందుకు గ్రామంలో కార్యదర్శి ,దర్శనం, కాకపోగా.. ఇందుకు తోడుగా సర్పంచ్ సైతం పట్టణంలో ఉండడంతో తమ గోడు వినే నాధులు లేరాని ప్రశ్నించారు. ఇప్పటికైనా జిల్లా పంచాయతీ ఉన్నతాధికారులు పట్టించుకోని పంచాయతీ కార్యదర్శి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.



