- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
ఇటీవల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన పదోవతరగతి వార్షిక పరీక్ష ఫలితాల్లో మండలం ఎడ్లపల్లి గ్రామపంచాయతీ పరిదిలోగల జంగిడిపల్లిలోగల తెలంగాణ అదర్శ పాఠశాలలో 500 పైగా మార్కులు సాధించిన బొంతల మనస్విని, అలీ నిశిత, బొగ నిఖిల్, కాళీ వర్ష, శనిగల సౌమ్యశ్రీ, భోగే సశ్రిత, కందునూరి హర్షిత, భేతిని ఆకాయ్, బుఖ్య మహేందర్ తదితర తొమ్మిదిమంది విద్యార్థులను గురువారం గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్, పాఠశాల ప్రిన్స్ పాల్ పూర్ణచందర్ రావు, అధ్యాపకులు శాలువాలతో సత్కారం చేశారు. విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి ఉన్నతశికరాలను అవరోధికాచాలని సర్పంచ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -



