Friday, May 1, 2026
E-PAPER
Homeసినిమాఅత్యద్భుతమైన రిలీజ్‌ కోసమే..

అత్యద్భుతమైన రిలీజ్‌ కోసమే..

- Advertisement -

కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌, మాన్‌స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్‌ బ్యానర్లపై రూపొందిన ‘టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌-అప్స్‌’ విడుదల తేదీని మళ్లీ మార్చినట్లు మేకర్స్‌ ప్రకటించారు. జూన్‌ 4న విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ మారనుంది. త్వరలోనే ఈ కొత్త డేట్‌ను ప్రకటించనున్నారు. సినిమాకాన్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించిన తర్వాత మేకర్స్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్కడ ప్రపంచవ్యాప్త డిస్ట్రిబ్యూటర్స్‌, పరిశ్రమ భాగస్వాముల నుండి ‘టాక్సిక్‌’కి అద్భుతమైన స్పందన లభించింది. ఈ స్పందనను చూసిన మేకర్స్‌ ఈ చిత్రాన్ని మరింత విస్తత అంతర్జాతీయ విడుదలకు అవకాశాలను కల్పించాలని, తమ ప్లానింగ్స్‌ను, రిలీజ్‌ డేట్‌లను పునః సమీక్షించు కుంటున్నారు. ‘టాక్సిక్‌’ వరల్డ్‌ వైడ్‌గా ప్రేక్షకులందరికీ చేరేలా నిర్మాతలు ప్లానింగ్‌ చేస్తున్నారు. ఈ చిత్రానికి యష్‌, గీతూ మోహన్‌దాస్‌ రచన చేయగా.. గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వం వహించారు.’మేము సాధారణంగా తీసే సినిమాలు కొన్ని ఉంటాయి, మరికొన్ని సినిమాలు అసలు మనం సినిమాను ఎందుకు ప్రేమించామో గుర్తు చేస్తాయి. ‘టాక్సిక్‌’ అలాంటి ఒక ప్రయాణమే. సినిమాకాన్‌లో మా చిత్రాన్ని ప్రదర్శించిన తరువాత.. అక్కడ వచ్చిన స్పందనను చూసిన తరువాత.. ఇది వరల్డ్‌ వైడ్‌గా అందరికీ చేరాల్సిన సినిమా అని మాకు అర్థమైంది’ అని మేకర్స్‌ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఆమోదయోగ్యమైన తదుపరి విడుదల తేదీని త్వరలోనే చెబుతాం. ‘టాక్సిక్‌’ త్వరలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది అని చిత్రయూనిట్‌ పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -