Friday, May 1, 2026
E-PAPER
Homeజిల్లాలుచౌట్ పల్లిలో ఇందిరమ్మ గృహప్రవేశం

చౌట్ పల్లిలో ఇందిరమ్మ గృహప్రవేశం

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్‌పల్లి: మండలంలోని చౌట్‌పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య పాల్గొని రిబ్బన్ కట్ చేసి నూతన గృహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్లు లేని పేద ప్రజలకు కుల, మత వివక్ష లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి ప్రతి పేదవాడి సొంత ఇంటి కళ నిజం చేస్తుందని అన్నారు. త్వరలో సొంత స్థలం లేని వారికి కూడా ప్రభుత్వం స్థలం ఇచ్చి ఇళ్లు మంజూరు చేసే ఆలోచనలో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకెట రవి, కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సుంకెట బుచ్చన్న, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు రవీందర్, నాయకులు బాలయ్య, తెడ్డు రమేష్, చౌట్ పల్లి గ్రామ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -