షిప్స్ రద్దీ 90 శాతం తగ్గుదల
26 నౌకలపై దాడులు
వాషింగ్టన్ : పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయిల్.. ఇరాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల వల్ల ప్రపంచంలోనే అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిలో నౌకల ప్రయాణం భారీగా పడిపోయింది. గతంలో రోజుకు సగటున 130 నౌకలు ప్రయాణించే ఈ మార్గంలో.. ప్రస్తుతం ఆ సంఖ్య 10 కంటే తక్కువకు పరిమితమైంది. అంటే దాదాపు 90 శాతానికి పైగా రద్దీ తగ్గి.. ప్రపంచ ఇంధన సరఫరా గొలుసు, వాణిజ్య మార్గాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (యూకేఎంటీఓ) ఓ రిపోర్ట్‌లో వెల్లడించింది. ఈ ఏడాది మార్చి 1 నుండి ఏప్రిల్ 27 మధ్య కాలంలో ఈ ప్రాంతంలో సుమారు 40కి పైగా ప్రమాదకర ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటిలో 26 నేరుగా వాణిజ్య నౌకలపై జరిగిన దాడులు కాగా.. మిగిలినవి డ్రోన్ దాడుల వల్ల కలిగిన నష్టం లేదా నౌకలను అడ్డుకోవడం వంటి ఘటనలు నమోదయ్యాయి. ఫిబ్రవరి 28న ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరుపక్షాల మధ్య మొదలైన ప్రతీకార దాడులే ఈ అనిశ్చితికి ప్రధాన కారణం.
గల్ఫ్‌లో చిక్కుకున్న వందలాది నౌకలు..
ఈ భద్రతా పరమైన ఆందోళనల కారణంగా సుమారు 850 నుంచి 870 వరకు భారీ వాణిజ్య నౌకలు గల్ఫ్ లోపలే చిక్కుకుపోయాయి. ఇరుకైన హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించడం ప్రాణాపాయంతో కూడుకున్నది కావడంతో ఈ నౌకలు సురక్షితంగా బయటకు రాలేక అక్కడే ఆగిపో యాయి. దీనివల్ల అంతర్జాతీయ సముద్ర రవా ణా వ్యవస్థ స్తంభించిపోయే పరిస్థితి ఏర్పడింది.
ప్రమాదంలో 20 వేల మంది నావికులు
నౌకలు నిలిచిపోవడంతో వాటిలో పని చేస్తున్న సుమారు 20,000 మంది నావికుల పరిస్థితి దయనీయంగా మారింది. నౌకలు కదలకపోవడంతో సిబ్బంది మార్పు సాధ్యపడటం లేదు. అలాగే ఆహారం, మంచినీరు వంటి నిత్యావసరాల సరఫరా కూడా క్రమంగా తగ్గిపోతోంది. ఈ అనిశ్చితి వల్ల నావికులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. వారి భద్రత, ఆరోగ్యం పట్ల యూకే మారిటైమ్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం..
అంతరాయం ఇలాగే కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా వస్తువుల ధరలు పెరగడమే కాకుండా సముద్ర మార్గాల్లో కొత్త భద్రతా సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. హోర్ముజ్ జలసంధిలో రక్షణ బలహీనపడితే ఇదే అదనుగా సోమాలియా తీరంలో మళ్లీ సముద్రపు దొంగలు విజృంభించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కేవలం పశ్చిమాసియాకే పరిమితం కాకుండా మొత్తం హిందూ మహాసముద్ర ప్రాంతానికే ముప్పుగా పరిణమిం చవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హార్ముజ్‌లో రోజుకు 10 నౌకలే ప్రయాణం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


