Saturday, May 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కేంద్ర మంత్రిని కలిసి నిధులు కేటాయించాలని వినతి 

కేంద్ర మంత్రిని కలిసి నిధులు కేటాయించాలని వినతి 

- Advertisement -

మునీగల వీడు గ్రామ ఆరవ వార్డు సభ్యుడు నల్లని పాపారావు 
నవతెలంగాణ-నెల్లికుదురు

కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసి మా గ్రామానికి అధిక నిధులు కేటాయించి గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరినట్లు మునిగిలవీడు గ్రామ పంచాయతీ ఆరవ వార్డు సభ్యుడు నల్లని పాపారావు వినతిపత్రం అందించి తెలిపారు. హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో శనివారం పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయని వాటిని మా మునిగేలా వీడు గ్రామాన్ని కి ప్రతి గడప గడపకు చీరే విధంగా కృషి చేయాలని కోరినట్టు తెలిపారు. అంతేకాకుండా అధిక నిధులు కేటాయించి వివిధ రకాల పనులను చేసి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు మీ వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకం చేరేందుకు మాకు మీ సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. వెంటనే మంత్రికి కృతజ్ఞతలు అని తెలిపారని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -