Sunday, May 3, 2026
E-PAPER
Homeఆటలుయస్టికా, రాధకు పిలుపు

యస్టికా, రాధకు పిలుపు

- Advertisement -

– ఐదోసారి హర్మన్‌ప్రీత్‌కు కెప్టెన్సీ పగ్గాలు
– మహిళల టీ20 ప్రపంచకప్‌నకు భారత జట్టు
నవతెలంగాణ-ముంబయి
2026 మహిళల ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టును శనివారం ఎంపిక చేశారు. యస్టికా భాటియ, అన్‌క్యాప్‌డ్‌ పేస్‌ బౌలర్‌ నందని శర్మ, స్పిన్నర్‌ రాధ యాదవ్‌లు జట్టులోకి వచ్చారు. ఈ ఏడాది జూన్‌-జులైలో ఇంగ్లాండ్‌ వేదికగా మహిళల టీ20 ప్రపంచకప్‌ జరుగనుంది. ఇటీవల దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో 1-4తో ఓడిన భారత జట్టులో ఈ ముగ్గురు ప్లేయర్లు ఆడలేదు. ఆల్‌రౌండర్‌ ఆమన్జోత్‌ కౌర్‌ వెన్నునొప్పితో సెలక్షన్‌కు అందుబాటులో లేదు. ఆమన్జోత్‌ కౌర్‌ స్థానంలో సఫారీ సిరీస్‌లో ఆడిన కాశ్వీ గౌతమ్‌ సైతం గాయపడటంతో ఆమెను ఎంపికకు పరిగణనలోకి తీసుకోలేదు. ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో సమావేశమైన సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. చీఫ్‌ సెలక్టర్‌ అమిత శర్మ, కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్‌ సైకియా జట్టును ప్రకటించిన అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. టీ20 ప్రపంచకప్‌ జట్టు.. ఇంగ్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో ఆడనుంది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ రికార్డు స్థాయిలో ఐదోసారి టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు నాయకత్వ వహించనుంది. ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ విజేతగా నిలిచిన భారత్‌.. టీ20 ప్రపంచకప్‌ కోసం ఎదురుచూస్తోంది. 2024లో నాకౌట్‌కు చేరటంలో విఫలమైన భారత్‌.. 2020లో ఫైనల్‌కు చేరుకుని రన్నరప్‌గా నిలిచింది. 2026 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ టైటిల్‌ వేట జూన్‌ 14న పాకిస్తాన్‌తో మ్యాచ్‌తో ఆరంభం కానుంది. పొట్టి ప్రపంచకప్‌ ఫైనల్‌ జులై 5న లార్డ్స్‌లో జరుగనుంది. గ్రూప్‌ దశలో పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌, ఆస్ట్రేలియాలతో భారత్‌ తలపడనుంది. మరో గ్రూప్‌లో ఇంగ్లాండ్‌, శ్రీలంక, ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌, వెస్టిండీస్‌, న్యూజిలాండ్‌ పోటీపడనున్నాయి. గ్రూప్‌ దశలో టాప్‌-2 జట్లు నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. తెలుగు తేజాలు అరుంధతి రెడ్డి, శ్రీ చరణి టీ20 ప్రపంచకప్‌ జట్టులో నిలిచారు. ఇటీవల వన్డే వరల్డ్‌కప్‌ విజయం సాధించిన జట్టులోనూ ఈ ఇద్దరు కీలక సభ్యులు. తాజాగా పొట్టి ప్రపంచకప్‌కు సైతం భారత జట్టులో చోటు సాధించారు. ఇంగ్లాండ్‌తో టెస్టులో శ్రీ చరణి రెడ్‌బాల్‌ ఫార్మాట్‌లో అరంగేట్రం చేయనుంది.
టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు :
హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), స్మృతీ మంధాన (వైస్‌ కెప్టెన్‌), షెఫాలీ వర్మ, జెమీమా రొడ్రిగస్‌, దీప్తి శర్మ, రిచా ఘోష్‌ (వికెట్‌ కీపర్‌), అరుంధతి రెడ్డి, రేణుక సింగ్‌, క్రాంతి గౌడ్‌, శ్రీ చరణి, శ్రేయాంక పాటిల్‌, భార్తి ఫుల్మాలి, యస్టికా భాటియ (వికెట్‌ కీపర్‌), నందని శర్మ, రాధ యాదవ్‌.
భారత మహిళల టెస్టు జట్టు :
హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), స్మృతీ మంధాన (వైస్‌ కెప్టెన్‌), షెఫాలీ వర్మ, జెమీమా రొడ్రిగస్‌, ప్రతికా రావల్‌, దీప్తి శరవ్మ, రిచా ఘోష్‌ (వికెట్‌ కీపర్‌), శ్రీ చరణి, యస్టికా భాటియ (వికెట్‌ కీపర్‌), నంది శర్మ, హర్లీన్‌ డియోల్‌, రేణుక ఠాకూర్‌, క్రాంతి గౌడ్‌, సయాలి, స్నేV్‌ా రానా. (టీ20 ప్రపంచకప్‌ అనంతరం ఇంగ్లాండ్‌తో భారత్‌ ఏకైక టెస్టులో ఆడనుంది. జులై 10 నుంచి లార్డ్స్‌లో భారత్‌, ఇంగ్లాండ్‌ టెస్టు జరుగనుంది).

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -