Sunday, May 3, 2026
E-PAPER
Homeసినిమా'జెట్లీ'కి విశేష ప్రేక్షకాదరణ

‘జెట్లీ’కి విశేష ప్రేక్షకాదరణ

- Advertisement -

కమెడియన్‌ సత్య, దర్శకుడు రితేష్‌ రానా కాంబోలో విడుదలైన చిత్రం ‘జెట్లీ’. క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌ సమర్పించింది. ఈనెల 1న వరల్డ్‌ వైడ్‌ థియేటర్స్‌లో రిలీజైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ విజయంతో సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్‌ నిర్వహించిన రోరింగ్‌ టేక్‌ అఫ్‌ మీట్‌లో డైరెక్టర్‌ రితేష్‌ రానా మాట్లాడుతూ,’నాకు రొటీన్‌కు భిన్నంగా ఉండే సినిమాలు చేయాలని ఉంటుంది. అలాంటి ఐడియాలు ఎప్పుడూ చెప్పినా, నాకంటే చెర్రీ ఎక్కువ ఎగ్జైటై సినిమాలు చేశారు. ‘జెట్లీ’ కథ కూడా అలాగే చెప్పాను. ఆయనకి చాలా నచ్చింది. సినిమాను ప్రేక్షకులు అద్భుతంగా ఆదరిస్తున్నారు. మేము థియేటర్‌ విజిట్స్‌కు వెళ్లినప్పుడు ప్రేక్షకుల స్పందన చూసి చాలా ఆనందంగా అనిపించింది’ అని అన్నారు.
‘నన్ను, రితేష్‌ని నమ్మి థియేటర్లకు వచ్చిన ప్రతి ప్రేక్షకుడికి ధన్యవాదాలు. థియేటర్లకు వెళ్లి ప్రేక్షకుల రెస్పాన్స్‌ చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ల ప్రేమ చూసి చాలా ఎమోషనల్‌ అయ్యాను’ అని హీరో సత్య చెప్పారు. నిర్మాత చెర్రీ మాట్లాడుతూ,’ఎవరూ చేయని అవుట్‌ ఆఫ్‌ ది బాక్స్‌ ఐడియాతో సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ‘జెట్లీ’తో అది సాధ్యమైంది. థియేటర్లలో ప్రేక్షకుల నుంచి యూనానిమస్‌గా అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాను ఎంజారు చేస్తున్నారు. కలెక్షన్స్‌ కూడా బావున్నాయి. మొదటి రోజు కొన్ని కారణాల వల్ల కొన్ని స్క్రీన్స్‌లో సినిమా స్క్రీన్‌ కాలేదు. ఈరోజు నుంచి అవి కూడా మొదలవుతున్నాయి కాబట్టి ఇంకా బెటర్‌ అవుతుంది. ఈ సమ్మర్‌లో ‘జెట్లీ’ ఒక కూల్‌ మూవీగా ఆడియన్స్‌ చెబుతున్నారు. రితేష్‌ రానా జోనర్‌.. ఈ సినిమాతో మరో స్థాయికి వెళ్లింది. సత్య ఈ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -