కీలుబొమ్మనో ప్రజలకు అర్థమైంది
ప్రజా పాలన కాదు వంచించే పాలన : బీఆర్‌ఎస్ విప్ కెపి వివేకానంద
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కవిత ఎవరి చేతిలో కీలుబొమ్మనో ప్రజలకు అర్థమైందని బీఆర్‌ఎస్ విప్ కెపి వివేకానంద అన్నారు. ఆమె రాజకీయ నాయకురాలిగా పనికిరారని చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ అంటే సాదా సీదా నాయకుడు కాదన్నారు. తెలంగాణ సాధించిన కీర్తి ఆయనదని చెప్పారు. కేసీఆర్‌పైన కవిత చేసిన వ్యాఖ్యల పట్ల తెలంగాణ సమాజం చీత్కరించుకుంటున్నదని అన్నారు. దీంతో ఆమె విలువలను కోల్పోయారని చెప్పారు. రాజకీయంగా కవితకు కేసీఆర్ అనేక అవకాశాలిచ్చారని గుర్తు చేశారు. ఇచ్చిన అవకాశాలను కవిత నిలుపుకోలేక పోయారని అన్నారు. తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్‌ఎస్ పార్టీనేనని చెప్పారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యక్రమం బూటకమని విమర్శించారు. ప్రజాపాలన పేరుతో ప్రజలను వంచించే పాలన అని అన్నారు. మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడుతూ గర్భిణీ మహిళలకు ఇచ్చే న్యూట్రీషన్ కిట్ కూడా తీసేశారని చెప్పారు. కేసీఆర్ కిట్ అని నచ్చకుంటే రేవంత్ కిట్, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ కిట్ అని పెట్టి ఇస్తే బాగుండేదని అన్నారు. ఉన్న సిటీని అభివృద్ధి చేయమంటే ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తామంటున్నారని చెప్పారు.
కవిత ఎవరిచేతిలో
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



