Sunday, May 3, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపేదలకు నాణ్యమైన వైద్యం అందించాలి

పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలి

- Advertisement -

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి.జహంగీర్‌
బైకాని నరసింహ స్థూపావిష్కరణ
నవతెలంగాణ-రామన్నపేట

పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జహంగీర్‌ కోరారు. అనేకమంది పేదలకు నాణ్యమైన వైద్యం అందక వైద్య చికిత్సలు చేయించుకోవడానికి డబ్బులు లేక ప్రాణాలు వదులుతున్నారని, పేదలకు నాణ్యమైన వైద్యం అందించడం కోసం ప్రభుత్వాలు కృషి చేయాలని డిమాండ్‌ చేశారు. యాదాద్రిభువనగిరి జిల్లా రామన్నపేట మండలం పల్లివాడ గ్రామంలో ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు బైకాని నరసింహ స్మారక స్తూపావిష్కరణ, సంతాప సభ శుక్రవారం రాత్రి గ్రామపంచాయతీ సెంటర్‌లో ఆ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాస్పత్రిల్లో మెరుగైన వైద్య సౌకర్యాలు అందిస్తే పేదలకు ఆర్థిక భారం తగ్గుతుందని చెప్పారు. సీపీఐ(ఎం) మాజీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ ప్రజల శ్రేయస్సుకోసం, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం ఉద్యమించే కమ్యూనిస్టులు మరణించినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని తెలిపారు. సీపీఐ(ఎం) నాయకుడు బైకాని నరసింహ సంతాప సభ సందర్భంగా ప్రజానాట్యమండలి కళాకారులు బహుజన కళారూపం గోసంగి వేషంతో ఇచ్చిన ప్రదర్శన ఆకట్టుకుంది. సమాజంలో ఉన్న కుల వ్యవస్థ అంటరానితనంపై అందర్ని ఆలోచించే విధంగా రచయిత బండి సత్తన్న రాసిన కళా రూపాన్ని గడ్డం పాండురంగం జాంబవంతుడు వేషధారణలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కల్లూరి మల్లేశం, జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, కల్లూరి నగేష్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -