Sunday, May 3, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తాం

నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తాం

- Advertisement -

ఏ ఉద్యోగం వచ్చినా చేయాలి : మెగా జాబ్‌ మేళాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి
నవతెలంగాణ -నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ‘న్యాక్‌’ (నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్స్ట్రక్షన్‌) లో నిర్వహించిన మెగా జాబ్‌ మేళాను ఆయన ప్రారంభించారు. దేశంలో నిరుద్యోగ సమస్య అతిపెద్ద సమస్యగా ఉందని, అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చదివిన చదువుకు ఉద్యోగం ఇచ్చే విధంగా కార్యచరణ ప్రణాళిక రూపొందించి ముందుకు వెళుతున్నట్టు తెలిపారు. మెగా జాబ్‌ మేళా ద్వారా 5000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి అపాయింట్మెంట్‌ ఆర్డర్‌ ఇవ్వాలని ఆయన కంపెనీలను కోరారు. యువత పెద్ద ఎత్తున జాబ్‌ మేళాకు వస్తున్నందున ఆదివారం కూడా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ను ఆదేశించారు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సిమెంటు కంపెనీలు, రైస్‌ ఇండిస్టీస్‌, ఫార్మా తదితర అనేక కంపెనీలు ఉన్నాయని, అందువల్ల స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. నిరుద్యోగులు ఎలాంటి ఉద్యోగం వచ్చినా ముందుగా చేరాలని, అనవసరంగా సమయం వృధా చేసుకోవద్దని, ఉద్యోగం చేస్తూ ఉన్నత ఉద్యోగాల కోసం చదువుకోవాలన్నారు. గతంలో తన హయాంలో నిర్వహించిన జాబ్‌ మేళా ద్వారా 18,400 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. రోడ్డు ప్రమాదాలలో అనేక మంది చనిపోతున్నారని రోడ్డు ప్రమాదాలను నివారించేం దుకు రోడ్డు భద్రతను చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్‌ ను ఆదేశించారు. అన్ని కంపెనీలు భద్రత చర్యలను తప్పకుండా పాటించాలని చెప్పారు. జిల్లా కలెక్టర్‌ బి. చంద్రశేఖర్‌ మాట్లాడుతూ సుమారు 124 కంపెనీలు జాబ్‌ మేళాలో ఉద్యోగాలు ఇచ్చేందుకు వచ్చాయని తెలిపారు. ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ మాట్లాడుతూ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావడం ద్వారా కుటుంబ ఆర్థిక పరిస్థితి మారుతుందన్నారు. నల్లగొండ మేయర్‌ బుర్రి చైతన్య శ్రీనివాస్‌ రెడ్డి, డిజిటల్‌ ఎంప్లాయిమెంట్‌ ఎక్సైంజ్‌్‌ డైరెక్టర్‌ రాజేందర్‌ రెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ వై. అశోక్‌ రెడ్డి డిప్యూటీ మేయర్‌ అష్రాఫ్‌ అలీ, మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ జూకురి రమేష్‌ ,జిల్లా క్రీడలు, యువజన సర్వీసులు అభివద్ధి శాఖ అధికారి అక్బర్‌ ఆలీ, పరిశ్రమల శాఖ జీఎం సతీష్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -