- Advertisement -
భారీగా ఆస్తినష్టం
నవతెలంగాణ – మెట్‌పల్లి
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో శనివారం ఓ ఆటో స్టోర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటో స్టోర్ పూర్తిగా దగ్ధమైంది. మెట్‌పల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యాడ్ దగ్గరలోని శ్రీనాథ్ ఆటోస్టోర్‌లో మధ్యాహ్నం పొగ రావడం గమనించిన స్టోర్ యజమాని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాడు. అంతలోనే షాపులోని ప్లాస్టిక్ సామగ్రి, టైర్లు, ఆయిల్ వల్ల మంటలు విస్తరించి స్టోర్ మొత్తం వ్యాపించాయి. అక్కడకు చేరుకొన్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చి పక్కన షాపులకు వ్యాపించకుండా చేశారు. ఈ ఘటనలో సుమారు రూ.20లక్షలకుపైగా ఆస్తినష్టం జరిగిందని స్టోర్ యజమాని తెలిపారు.
- Advertisement -



