- Advertisement -
భూమి తిరగడమేమోగానీ
కాలం పరిగెడుతున్నట్లైతే,
కళ్ళారా కనిపిస్తూనే ఉంది
ఎవరో తరుముతున్నట్లుగా
పడిపోయిందేదీ పట్టుకోనంతగా
కాలం పరిగెడుతూనేఉంది
నిన్నటి జ్ఞాపకాలే గుర్తులేనంతగా
పొద్దుటి ముఖాన్నే పోల్చలేనంతగా
తీయని జ్ఞాపకాలకు తీరిక లేనంతగా
పడుతూ లేస్తూ, పడుతూ లేస్తూ
కాలం పరిగెడుతూనే ఉంది
బతుకు ఇరుసుపై
దురాశ కందెన పూసి
కాల కొరడా ఝుళిపిస్తున్న మనిషి
తిరిగీ తిరిగి, మొదలెట్టిన చోటుకే వచ్చి
పరిగెడుతూ కరిగినది కాలం కాదని,
తన ప్రయాణం అని తెలిసే సరికే
మనిషి లేకపోవడం యాదచ్ఛికమే!
- వినోద్ కుత్తుం, 9634314502
- Advertisement -


