Monday, May 4, 2026
E-PAPER
Homeదర్వాజఆనంద కెరటం

ఆనంద కెరటం

- Advertisement -

చూపులో తేడాలు
నడకలో భేదాలు
నలుగురం నాలుగు విధాలుగా
నెత్తురు మాత్రం ఒక్కటే
ఎవరు ఎక్కడ మొదలయ్యారో
ఎందుకు విధి వంచితులయ్యారో
అజాగ్రత్తతో అపాయాన్నిమూటగట్టుకొని
రక్తం కోసం వెతుకులాటలో
ప్రాణం కోసం పెనుగులాటలో
విషాదాన్ని మోస్తున్న దుఃఖ సమయం
ఎవరిదైనా దుఃఖం ఒక్కటే
మనలోని మానవత్వం వారి
కన్నీటిని దాటి రక్తాన్ని పంచగలదు
అపరిచితుడైతే నేమి !?
ఆయుష్షు పెంచగలదు
రక్తంలో గ్రూపులు వేరైనా
ప్రాణం ఒక్కటే, శ్వాస ఒక్కటే
మనం చేసే రక్తదానం మాత్రం
శత సహస్ర జీవితాల ఆనంద కెరటం.

  • ఒద్దిరాజు ప్రవీణ్‌ కుమార్‌, 9849082693
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -