Tuesday, May 5, 2026
E-PAPER
Homeవరంగల్జాతీయ రహదారిపై ధర్నా..

జాతీయ రహదారిపై ధర్నా..

- Advertisement -

నవతెలంగాణ-వర్ధన్నపేట
వర్ధన్నపేట మండలం ఇల్లంద వ్యవసాయ మార్కెట్ ను కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సందర్శించారు రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు మల్లాడి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో మక్కలు , వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో సందర్శించారు. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బసవపురం లక్ష్మీ నరసయ్య రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు కాంటాలు జరిగినప్పటికీ మక్కలు ట్రాస్పోర్ట్ పోకపోవడంతో రైతులు మార్కెట్లో పడిగాపులు కాస్తున్నారన్నారు రాష్ట్ర ప్రభుత్వం రైతును మోసం చేస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి తోపాటు ముఖ్యమంత్రి రైతాంగాన్ని పట్టించుకోవడం లేదన్నారు. అనంతరం వరంగల్ ఖమ్మం ప్రధాన రహదారిపై గంటపాటు ధర్నా నిర్వహించారు. సీఎం డౌన్ అంటూ నినాదాలు చేశారు.

ఈ ధర్నాతో రోడ్డుకి ఇరువైపులా ట్రాఫిక్ తీవ్రగా స్తంభించింది ధర్నాను పిరమింకా చేసే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులకు కిసాన్ మోర్చా నాయకులకు కాసేపు తోపులాట జరిగింది. వర్ధన్నపేట పోలీసులు జోక్యం చేసుకుని ధర్నాను విరమింప చేశారు వర్ధన్నపేట సీఐ శ్రీనివాసరావు, ఎస్సై సాయిబాబు ధర్నా నిర్వహించిన వారిని బలవంతంగా తీసుకెళ్లి అరెస్టు చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ , వన్నాల శ్రీరాములు భాజపా రాష్ట్ర జిల్లా పార్టీ వ్యవహారాల ఇన్చార్జి కొండపల్లి శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర అధికారప్రతినిది వన్నాల వెంకట రమణ, నాయకులు జలగం రంజిత్ రావు. సిద్ధం నరేష్. రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు గార్లపాటి మంజులరెడ్డి. నియోజకవర్గం కన్వీనర్ ముత్తిరెడ్డి కేశవరెడ్డి,వర్ధన్నపేట మండల అధ్యక్షులు అడప రాజు, పంతిని, కట్ర్యాల గ్రామ సర్పంచులు హర్షణ పెళ్లి శ్రీరాం భూపాల్, రాయపురం రమ్య రాజు, రాయ పురం కుమారస్వామి, కుందూరు మహేందర్ రెడ్డి పలువురు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -