నవతెలంగాణ – జుక్కల్
మండల కేంద్రంలో ఆయిల్ ఫామ్ తోటను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యాన పంటల సాగు, ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం పెంపుదల, ప్రత్యామ్నాయ పంటలపై రైతులతో ముఖాముఖి మాట్లాడి అవగాహన కల్పించారు. ఆయిల్ ఫామ్ పంటలో నాటిన తరువాత సుమారు నాలుగు సంవత్సరాల నుంచి దిగుబడి ప్రారంభమై, ఆర్థిక లాభాలు క్రమంగా పెరుగుతాయని వివరించారు.
ఆయిల్ ఫామ్ సాగు విస్తరణతో వచ్చే లాభాలను తెలియజేసి, రైతులు ఆధునిక పద్ధతులు అవలంబించి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించాలని సూచించారు. ఆయిల్ ఫామ్ వేసిన రైతులను ఎమ్మెల్యే సన్మానించారు. అలాగే ప్రభుత్వ పథకాల ద్వారా రైతులకు అన్ని విధాలుగా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. రైతుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నది ఈ ప్రభుత్వం — ఇదే ప్రజా ప్రభుత్వం అని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో మారుతి, ఏవో మహేశ్వరి , జుక్కల్ గ్రామ సర్పంచ్ కర్రేవార్ సావిత్రి , మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయా గౌడ్, చండేగావ్ సర్పంచ్ బండేడ్ వార్ లక్ష్మన్, పెద్ద గుల్ల సర్పంచ్ మాదారావ్ దేశాయి, గ్రామస్తులు రాజుల్ సేట్ , దాదారావ్ పటేల్ , పలు గ్రామాల రైతులు, తదితరులు పాల్గొన్నారు.




