పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి
ధాన్యం ఆరబోసేందుకు పట్టాలు ఉచితంగా అందించాలి :
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
రంగారెడ్డి జిల్లాలో కొనుగోలు కేంద్రాల సందర్శన
కలెక్టరేట్ల ఎదుట ధర్నాలకు పిలుపు
నవతెలంగాణ- ఇబ్రహీంపట్నం
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరుతో రైతును నిలువు దోపిడీకి గురిచేస్తున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు నామమాత్రంగానే కొనసాగుతున్నాయని. పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదని అన్నారు. ఎండలు తీవ్రంగా ఉంటే.. కేంద్రాల్లో కనీస వసతులు కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని రాయపోల్ ధాన్యం కొనుగో లు కేంద్రాన్ని స్థానిక సీపీఐ(ఎం) నాయకులతో కలిసి ఆయన మంగళవారం సందర్శించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ.. వరి ధాన్యం కొనుగోళ్లను తక్షణమే పూర్తి స్థాయిలో ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోజుల తరబడి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉండటం వల్ల వర్షాలకు రైతులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడం లేదన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు నానా అవస్థలు పడుతున్నారన్నారు. ధాన్యం ఆరబోయడానికి పదాలను(పట్టాలను) ఇవ్వడం లేదని, రైతులు కిరాయికి తెచ్చుకుంటున్నారని తెలిపారు. తేమ, తాలు పేరుతో క్వింటాలుకు దాదాపు నాలుగు నుంచి ఐడు కిలోల తరుగు తీస్తున్నారని, మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో జాప్యం కారణం గా రైతులు ప్రయివేట్ మిల్లర్లకు తక్కువ ధరకే ధాన్యాన్ని విక్రయిస్తున్నారని చెప్పారు. నేటికీ పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించ కపోవడం ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.గౌరయ్య కుటుంబానికి
రూ.30 లక్షల ఎక్స్ గ్రేషియా రాయపోల్ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద మరణించిన మంగలి గౌరయ్య కుటుంబానికి రూ.30 లక్షల ఎక్స్రేషియా ఇవ్వాలని జాన్ వెస్లీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చిన తర్వాత ప్రభుత్వానిదే పూర్తి బాధ్యతన్నారు. కొనుగోలు కేంద్రంలోనే గౌరయ్య మృతిచెందాడని ఆవేదన వ్యక్తం చేశారు. నామమాత్రపు పరిహారం అందజేసి చేతులు దులుపుకోవాలనుకోవడం సరికాదన్నారు. ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ రాష్ట్రంలోని కలెక్టరేట్ల ఎదుట సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.సామెల్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి దుబ్బాక రామచందర్, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సీహెచ్. బుగరాములు, నాయకులు పి. జగన్, సిహెచ్ జంగయ్య, ఏ. నర్సింహా, సిహెచ్. ముసలయ్య, నీరుడు భిక్షపతి, టి. నరసింహా, సీహెచ్ ఎల్లెష్, యాదగిరి, నర్సింహా, అశోక్ పాల్గొన్నారు.
తరుగు పేర నిలువు దోపిడీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



