కార్మికవర్గ ప్రయోజనాలకు
కార్మిక హక్కులను హరించి లాభాలు ఆర్జించాలని ఉవ్విళ్లూరుతున్న యజమాన్యాలు
శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ 18వ మహాసభలో.. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు,
ఎస్‌ఈయూ అధ్యక్షులు చుక్క రాములు
నవతెలంగాణ-పటాన్ చెరు
కార్మికవర్గ ప్రయోజనాల కోసం నికరంగా పోరాడుతున్న సంఘం సీఐటీయూ అని ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, ఎస్‌ఈయూ అధ్యక్షులు చుక్క రాములు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతంలోని శాండ్విక్ కంపెనీ ఎంప్లాయీస్ యూనియన్ 18వ మహాసభను పరిశ్రమ ఆవరణలో ఆదివారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా చుక్క రాములు.. యూనియన్ పతాకాన్ని ఆవిష్కరించి సభను ప్రారంభించి మాట్లాడారు. కార్మిక వర్గం మెడపై ఉంచిన లేబర్ కోడ్స్‌లో అనేక అంశాల్లో స్పష్టత లేదని, ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న కార్మిక హక్కులు హరించి మరింత లాభాలు ఆర్జించాలని యాజమాన్యాలు ఉవ్విళ్లూ రుతున్నాయని ఆరోపించారు. లేబర్ కోడ్స్ ప్రకారం 10 శాతం పీఎఫ్ కట్ చేస్తే సరిపోతుందని, ఇది అమలైతే కార్మికులు నష్టపోతారన్నారు. పని గంటలపై దాడి జరుగుతోందని.. మనకు తెలియకుండానే పెద్ద ప్రమాదం మన తలుపు తడుతోం దన్నారు. ఇలాంటి నేపథ్యంలో మన యూని యన్ మరింత చైతన్యవంతంగా పనిచేయా ల్సిన అవసరముందన్నారు. 42ఏండ్లుగా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సీఐటీయూ కంటిన్యుటీ నాయకత్వంతో ఐక్యంగా వాటిని ఎదుర్కొని ఒక ఆదర్శవంతమైన యూనియన్‌గా శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ కొనసాగుతూ.. 40వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నామన్నారు.
సీనియర్స్ ఒక్కొక్కరుగా రిటైర్ అవుతున్న ప్రస్తుత దశలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. యంగ్ వర్కర్స్ విషయంలో సీఐటీయూ ప్రత్యేక కార్య క్రమాలు రూపొందించి రాష్ట్రవ్యాప్తంగా అమలుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అనంతరం కార్యదర్శి ప్రవేశపెట్టిన కార్యకలా పాల రిపోర్టు, ట్రెజరర్ ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్‌ను మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ మహాసభలో లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని, కనీసవేతనం రూ. 26000 నిర్ణయించి అమలు చెయ్యాలని తీర్మానాలను ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం నూతన ఆఫీస్ బేరర్స్, కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. యూనియన్ అధ్యక్షులుగా చుక్క రాములు, అడ్వైజర్‌గా పి. పాండురంగా రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎం. సత్తిబాబు, వైస్ ప్రెసిడెంట్‌గా ఎం. మనోహర్, జనరల్ సెక్రెటరీగా బి.ప్రదీప్ కుమార్, జాయింట్ సెక్రటరీగా జి.గణేష్, ఆఫీస్ సెక్రెటరీగా కె.సురేష్ కుమార్, ట్రెజరర్‌గా వి. సదాశివ రెడ్డి 10 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల ను వివిధ డిపార్టుమెంట్స్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.



