Wednesday, May 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
జుక్కల్ మండల కేంద్రంలో మాజీ ఎంపీపీ భర్త నీలు పటేల్  ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే శ్రీ హన్మంత్ షిండే బుదువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ, పెరుగుతున్న ఎండల తీవ్రత మధ్య ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రజల సేవే ప్రధాన లక్ష్యంగా ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. ఎండలు మండుతున్న ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, ఎక్కువగా నీరు త్రాగుతూ ఉండాలని అన్నారు. ఏర్పాటుచేసిన చలివేంద్రం ద్వారా మండల కేంద్రంనకు వచ్చే ప్రజలకు ఉపశమనం కలుగుచున్నది పేర్కొన్నారు . అదేవిధంగా జుక్కల్ మండలంలోని పడంపల్లి మరియు జుక్కల్ మండల కేంద్రంలోని వివాహ కార్యక్రమాల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. ఈ చలివేంద్రం ప్రారంభోత్సవ కార్య క్రమంలో  స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -