టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగామ ఉపేందర్ రెడ్డి
నవతెలంగాణ – ఆలేరు రూరల్
రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం వడ్ల కొనుగోలు ప్రక్రియను సులభతరం చేస్తుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగామ ఉపేందర్ రెడ్డి అన్నారు.బుధవారం ఆలేరు మండలం కొల్లూరు గ్రామంలోని పీఏసీఎస్ సెంటర్‌ను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడ్లను నేరుగా లారీలకు ఎక్కించి తరలించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇకపై లారీలు సమయానికి అందుబాటులో ఉండేలా చూస్తామని రైతులకు హామీ ఇచ్చారు.అనంతరం అక్కడ పనిచేస్తున్న హమాలి కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు రైతులు, కార్మికులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
రైతులకు ఇబ్బందులు లేకుండా వడ్ల కొనుగోలు ప్రక్రియ సులభతరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



