కూలీలు లేక రైతులకు ఇబ్బందులు

నవతెలంగాణ- తాడ్వాయి: తాడ్వాయి మండల కేంద్రంలోని ఆయా గ్రామాలకు చెందిన రైతులకు కూలీలు దొరకకపోవడంతో పంట పొలాలలో పనులు నిర్వహించడానికి. ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈరోజు ఎల్లారెడ్డిలో ముఖ్యమంత్రి ఆశీర్వాద సభ ఉండడంతో ప్రజలందరిని పార్టీల నాయకులు కూలీలకు 300 రూపాయల చొప్పున ఒక్కొక్కరికి ఇవ్వడంతో వారందరూ బీఆర్ఎస్ ఆశీర్వాద సభకు ఏర్పాటు చేసిన వాహనాలలో వెళ్లడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి భోజనం వసతితోపాటు మందు పానీయాలు ఏర్పాటు చేయడంతో వృద్ధులు మహిళలు పిల్లాపాపలు ఆశీర్వాద సభకు తరలి వెళ్లారు.

Spread the love