నవతెలంగాణ- రామారెడ్డి: మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలను మంగళవారం నిర్వహించారు. నెహ్రు విగ్రహానికి, చిత్ర పటాలకు పూలమాలవేసి నివాళలు అర్పించారు. పలువురు మాట్లాడుతూ… భారతదేశ మొట్టమొదటి ప్రధాని నెహురుకు బాలు అంటే ఎంతో ప్రేమ అని, ఆయన పుట్టిన రోజును బాలల దినోత్సవం గా జరుపుకోవాలని ఆనందుదాయకమని అన్నారు. కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ అమ్ముల పశుపతి, యూత్ అధ్యక్షులు గణేష్ తదితరులు పాల్గొన్నారు.