లిల్లీపుట్ పాఠశాలలో మేఘ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం

నవతెలంగాణ- ఆర్మూర్: పట్టణంలోని లిల్లీపుట్ పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా మంగళవారం పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ..ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరూ చక్కని మంచి మంచి రుచికరమైన వంటకాలను టిఫిన్స్ స్నాక్స్ స్వీట్ పదార్థాలు వంటి పోషకాహార పదార్థాలను తీసుకొని వచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరూ మాస్టర్ షిప్ వేశాలతో అందరినీ అలరించారు.. ఈ కార్యక్రమంలో భాగంగా ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ చిలుక శ్రీనివాస్ ,పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ లు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు అని విద్యార్థులందరూ ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహార నియమాన్ని పాటించాలని పోషక విలువలు మాంసాకృతులు పిండి పదార్థాలు వంటి ఆహార పదార్థాలను తీసుకోవాలని అమ్మ చేతి వంటకం చాలా రుచికరమైనదని బయట జంక్ ఫుడ్ ను తీసుకోవద్దని ఇంట్లో చేసిన వంటకాలు ఆరోగ్యానికి ఎంతో మంచిదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ చిలుక శ్రీనివాస్ మాట్లాడుతూ ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించడం చాలా ఆనందకరంగా ఉందని ముఖ్యంగా వివిధ ప్రాంతాల్లోని ప్రజలు వివిధ రకాల ఆహార పదార్థాల నియమాలను పాటిస్తారని ముఖ్యంగా తెలంగాణ ప్రాంత వాసుల ఆహార పదార్థాలను చక్కగా వివరించడం జరిగింది .. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ ప్రిన్సిపాల్ దాస్ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు..

Spread the love