శ్రీ విద్య సాయి పాఠశాలలో స్టూడెంట్ లీడ్ కాన్ఫిరెన్స్

నవతెలంగాణ- కమ్మర్ పల్లి: మండల కేంద్రంలోని శ్రీ విద్య సాయి ఉన్నత పాఠశాలలో మంగళవారం స్టూడెంట్ లీడ్ కాన్ఫిరెన్స్ (ఎస్.ఎల్.సి) నిర్వహించారు. ఇందులో బాగంగా విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొని తమ పిల్లల యొక్క ప్రగతి గురించి తెలుసుకుని, తమ యొక్క సూచనలు సలహాలు అందించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని విశేషంగా అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఏనుగు గంగారెడ్డి, డైరెక్టర్ ఏనుగు ప్రమీల, ప్రధానోపాధ్యాయులు ఎం. శ్రీనివాస్, ఉపాధ్యాయులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Spread the love