కందకుర్తి గోదావరి గంగా హారతి స్థల పరిశీలన..

నవ తెలంగాణ- రెంజల్: నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి గోదావరి త్రివేణి సంగమం పుష్కర ఘట్ల వద్ద గంగాహారతి స్థలాన్ని ఉత్సవ కమిటీ అధ్యక్షులు రచ్చ తిరుపతి మంగళవారం పరిశీలించారు. నేటి నుంచి డిసెంబర్ 12 వరకు ప్రతి సోమవారం గంగా హారతి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రధాన ఘాట్ల వద్ద చెత్త చెదారని తొలగించి పరిసరల పరిశుభ్రత కోసం స్థలాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పుష్కర ఘాట్ చైర్మన్ గంగరాజు, ఉప సర్పంచి దేవుళ్ళ యోగేష్, స్థానిక నాయకులు గంగా సింగ్, గంగాధర్ ,నాగేష్, ధర్మయ్య ,తదితరులు పాల్గొన్నారు.
Spread the love