Sunday, May 17, 2026
E-PAPER
Homeసినిమాఆద్యంతం వినోదభరితం

ఆద్యంతం వినోదభరితం

- Advertisement -

ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యానర్‌పై నాగ‌మోహ‌న్ నిర్మాణంలో లావ‌ణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో రానున్న చిత్రం ‘సతీ లీలావతి’.
తాతినేని స‌త్య దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఈనెల 8న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం లావణ్య త్రిపాఠి మీడియాతో ముచ్చటించారు.
‘సతీ లీలావతి’ మూవీని ఆల్రెడీ చూశాను. చాలా బాగుంది. నాకు ఎంతో నమ్మకం ఉంది. ఇక ఆడియెన్స్ ఎలాంటి రిజల్ట్ ఇస్తారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. నేను ఇందులో డైరెక్టర్ పాత్రలో కనిపిస్తాను. సినిమా ఆద్యంతం ఎంటర్టైన్మెంట్ అద్భుతంగా ఉంటుంది. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు. నేను, నా మేనేజర్ సినిమా చూస్తూ బాగా నవ్వుకున్నాం. కొన్ని చోట్ల ఎమోషనల్‌గా ఉంటుంది. మంచి మెసెజ్ ఉన్నా కూడా ఏదో క్లాస్ పీకుతున్నట్టుగా అనిపించదు. ఈ సినిమాలో చూపించినట్టుగా రిలేషన్స్ బయటి ప్రపంచంలో ఉండవు. అలాంటి పరిస్థితి ఏ మహిళకీ రాకూడదు. నాకు రియల్‌ లైఫ్‌లో వరుణ్ లాంటి మంచి భర్త దొరికారు. ప్రస్తుతం నేను నా భర్త, కొడుకుతో హ్యాపీగా ఉన్నాను. ఈ సినిమా చేస్తున్నప్పుడు నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది. అలా అని స్క్రిప్ట్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. కాకపోతే యాక్షన్ సీక్వెన్స్‌లో మార్పులు చేశారు. రామ్ చరణ్ మాకు ఎప్పుడూ సపోర్టివ్‌గానే ఉంటారు. మా కోసం ఆయన ట్రైలర్ రిలీజ్ చేయడం సంతోషంగా అనిపించింది. రామ్ చరణ్ రిలీజ్ చేయడంతో మాకు మరింత రీచ్ వచ్చింది. చిరంజీవి మా అందరినీ ఎంతో ఎంకరేజ్ చేస్తుంటారు. మేం కూడా ఆయనకు ట్రైలర్ చూపించాలని అనుకుంటున్నాం.
దేవ్మోహన్ అద్భుతమైన నటుడు. కమల్ హాసన్ ‘సతీ లీలావతి’తో పోల్చలేం. కానీ మా సినిమా మాత్రం వినోదాత్మకంగా సాగుతుంది. ఈ చిత్రం ఎంతో రిఫ్రెషింగ్‌గా ఉంటూ పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది. నేను, వరుణ్ కలిసి నటించాలని ఉంది. మేమిద్దరం కలిసి నటించాలంటే ఆ కథ కచ్చితంగా చాలా భిన్నంగా ఉండాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -