కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొబిన్ ఖాన్ సమక్షంలో భారీగా మహిళలు చేరిక

నవతెలంగాణ- రెంజల్: రెంజల్ మండలం కూనేపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలకు ఆకర్షితులై భారీ సంఖ్యలో మహిళలు, రైతులు పాల్గొన్నారు. రెంజల్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొబిన్ ఖాన్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పుకున్నారు. అనంతరం ఈ గ్రామంలో పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. రైతన్నలకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పి .సుదర్శన్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలుపొందించుకుందామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి నాగభూషణం రెడ్డి, ధనుంజయ్, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు సురేందర్ గౌడ్, మాజీ మండల అధ్యక్షులు జి సాయి రెడ్డి, కాంగ్రెస్ నాయకులు నీరడి సాయిలు, శ్రీనివాస్ గౌడ్, దేవదాస్, చందర్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love