Tuesday, February 10, 2026
E-PAPER
Homeసినిమాస్వతంత్ర సినిమాలకు వేదికగా..

స్వతంత్ర సినిమాలకు వేదికగా..

- Advertisement -

భారతీయ మూలాలు కలిగిన ఫిల్మ్‌మేకర్‌, నటుడు, నిర్మాత వెంకట్‌ సాయి గుండా. న్యూయార్క్‌ నగరంలో ‘ది స్టోరీటెల్లర్‌ యూని వర్స్‌’ అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ను ఆయన విజయవంతంగా ప్రారంభించారు. కరీంనగర్‌ (తెలంగాణ)కు చెందిన వెంకట్‌ సాయి గుండా తన ఫీచర్‌ ఫిల్మ్‌ ‘ది డిజర్వింగ్‌’తో అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. ఇది 25కి పైగా ఫెస్టివల్స్‌లో స్క్రీనింగ్‌ అయ్యింది. అనేక అవార్డులూ సాధించింది. ఇప్పుడు ఫెస్టివల్‌ డైరెక్టర్‌గా, స్వతంత్ర సినిమాలకు మద్దతు ఇచ్చేలా ఆయన ఈ వేదికను ఏర్పాటు చేయటం విశేషం.
ఈనెల 10, 11న న్యూయార్క్‌లో జరిగిన తొలి ఎడిషన్‌లో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి ఫిల్మ్‌మేకర్లు, కళాకారులు హాజరయ్యారు.
వ్యాపారం కంటే భావోద్వేగాలు, నిజాయితీ, మాన వీయ కథలపై దష్టి సారించిన ఈ ఫెస్టివల్‌ అందరి దృష్టిని ఆకర్షించింది.
ఫెస్టివల్‌ను జగ్గీ అరోరా, జేడీ బ్రూక్‌షైర్‌, మహేశ్వరపాండియన్‌ సర్వణన్‌, తరుణ్‌ డేగల, తిరుమలేష్‌ గుండ్రాత్‌, ప్రత్యూష వుడతలతో కూడిన టీమ్‌ సహకారంతో నిర్వహించింది.
‘సినిమా చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఫిల్మ్‌మేకర్లకు మద్దతు ఇవ్వడం, వారి కథలను ప్రపంచానికి చేర్చడమే లక్ష్యం’ అని వెంకట్‌ సాయి గుండా తెలిపారు.
రాబోయే ఎడిషన్లలో వర్టికల్‌ స్టోరీటెల్లింగ్‌ను అధికారిక విభాగంగా చేర్చనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. 2026 ఎడిషన్‌ సబ్‌మిషన్లు ప్రస్తుతం ఓపెన్‌లో ఉన్నాయి. ఈ ఫెస్టివల్‌ భారతీయ స్వతంత్ర సినిమా రంగానికి గర్వకారణంగా నిలిచింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -