కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను నెరవేరుస్తాం

– కాంగ్రెస్ పార్టి ఎమ్మేల్యే అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్
నవతెలంగాణ- కమ్మర్ పల్లి: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను నెరవేరుస్తామని కాంగ్రెస్ పార్టి ఎమ్మేల్యే అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ అన్నారు.  గురువారం మండలంలోని బషీరాబాద్, హాసకొత్తూర్, చౌట్ పల్లి  గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచార నిర్వహణ కార్యక్రమంలో బాగంగా ఆయా గ్రామాలలో సునీల్ కుమార్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టి అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని తెలిపారు. ప్రతీ మహిళ ఖాతాలో మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు, పించను 4000 లకు పెంచుతామన్నారు.రైతు భరోసా కింద 15000 పెట్టుబడి సాయం, రైతు కూలీలకు సంవత్సరానికి 12000, ప్రతీ కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, విద్యార్థులకు 5 లక్షల విద్యా కార్డులు, ప్రతీ మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ నిర్మిస్తామని తెలిపారు. పింఛను 4000 అందిస్తామని తెలిపారు.ప్రజలను బీఆర్ఎస్ పార్టి మోసం చేసిందని, దోపిడి చేసిందని బీఆర్ఎస్ పార్టీపై తిరగబడి తరిమికొట్టాలని ముత్యాల సునీల్ కుమార్  పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love