Thursday, May 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

- Advertisement -

• ఇద్దరికి తీవ్ర గాయాలు
• కొరిపల్లి శివారులో ఘటన
నవతెలంగాణ – పెద్దవంగర
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం మండలంలోని కొరిపల్లి గ్రామ శివారులో శనివారం రాత్రి జరిగింది. ఘటనకు సంబంధించి ఎస్సై చిలువేరు ప్రమోద్ కుమార్ గౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని శంకర్ తండా కు చెందిన జాటోత్ వెంకన్న తన భార్య జాటోత్ విజయ, చిన్నమ్మ జాటోత్ భద్రమ్మ (60) ముగ్గురు కలిసి, వడ్డెకొత్తపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రానికి వడ్లు తూర్పార పట్టడం కోసం ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. అదే సమయంలో తిరుమలగిరి వైపు గా వెలుతున్న గుర్తు తెలియని తెల్ల రంగు గల కారు ద్విచక్ర వాహనాన్ని వెనుకవైపు నుండి ఢీ కొట్టింది. భద్రమ్మ తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. వెంకన్న, విజయ కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు తొర్రూరు లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మృతురాలు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆమెకు భర్త రామోజీ, కుమారుడు విజయ్ కుమార్, కూతురు మంజుల ఉన్నారు. కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -