Thursday, May 14, 2026
E-PAPER
Homeజాతీయంతక్షణమే రాష్ట్ర హోదా ఇవ్వాలి

తక్షణమే రాష్ట్ర హోదా ఇవ్వాలి

- Advertisement -

కేంద్రం అలసత్వంతో 
అత్యంత అధ్వాన్నంగా ప్రభుత్వ రూపం : 
పీటీఐతో జమ్ముకాశ్మీర్‌ ‌సీఎం ఒమర్‌ అబ్దుల్లా
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని ప్రస్తుత పరిపాలనా వ్యవస్థ అత్యంత అధ్వానమైన ప్రభుత్వ రూపం”గా ఉందని, పూర్తి రాష్ట్ర హోదా దిశగా తక్షణమే మారాలని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఆయన పీటీఐతో మాట్లాడుతూ జమ్మూ, శ్రీనగర్‌ల మధ్య రాజకీయంగా చీలిక తీసుకురావడానికి కొన్ని స్వార్థపర శక్తులు ప్రయత్నిస్తున్నాయని, అవి ఇప్పటికే విఫలమయ్యాయని, భవిష్యత్తులోనూ విఫలమవుతాయని చెప్పారు. ఈ రెండు ప్రాంతాల మధ్య ఉన్న భావోద్వేగ అంతరాన్ని తగ్గించేందుకు గతంలో ‘దర్బార్ మూవ్’గా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి రాజధానిని మార్చే సాంప్రదాయ పద్ధతిని పునరుద్ధరించడం ఒక కీలకమైన వారధి అని ఆయన చెప్పారు. 90 మంది ఎన్నికైన శాసనసభ్యులు ఉన్న ఒక ప్రాంతాన్ని, కేవలం 30 మంది మాత్రమే ఉన్న పుదుచ్చేరి వంటి చిన్న ప్రాంతాలతో సమానంగా చూడటం సరికాదని అన్నారు. రెండు రకాల అధికార నిర్మాణాలు ఉండే ద్వంద్వ అధికార వ్యవస్థ “విపత్తుకు దారితీస్తుందని” తాను గతంలో చెప్పానని గుర్తు చేశారు. “కేంద్ర సేవలు, శాంతిభద్రతలు, పోలీసుల విషయాలపై నేను వాదించడం లేదు. కేంద్ర పాలిత ప్రాంతంగా, ఆ అంశాలు స్వయంచాలకంగా ఎన్నిక కాని ప్రభుత్వ (కేంద్రం) పరిధిలోనే ఉంటాయి. కానీ ఈ సంస్థలు గతంలో ఎన్నికైన ప్రభుత్వ బాధ్యతగా ఉండేవి. అవి అలాగే ఉండాలి,” అని అన్నారు. పహల్గామ్‌ ‌విషాదాన్ని ప్రస్తావిస్తూ… శాంతిభద్రతల విషయంలో ఎన్నికైన ప్రతినిధులను దూరంగా ఉంచడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పారు.

జమ్మూ కాశ్మీర్ పరిమాణం, విస్తీర్ణత దృష్ట్యా, పరిపాలనకు ఎన్నికైన ప్రతినిధులే పూర్తి బాధ్యత వహించే పాలనా నమూనా అవసరమని చెప్పారు. పరిపాలనా వ్యవహారాల నిర్వహణ నియమాలపై కేంద్రంతో ఉన్న విభేదాలను తగ్గించడంలో గణనీయమైన పురోగతి సాధించినట్లు చెప్పారు. విశ్వవిద్యాలయాలు, షేర్-ఎ-కాశ్మీర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, విద్యుత్ అభివృద్ధి సంస్థ వంటి అనేక కీలక సంస్థలు స్వయంచాలకంగా ఎన్నికైన ప్రభుత్వ పరిధిలోకి రావాల్సి ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల ఏకపక్ష తొలగింపులు అసంబద్ధం న్యాయ విచారణ లేకుండా ప్రభుత్వ ఉద్యోగులను కేంద్రం ఏకపక్షంగా తొలగించడం అసంబద్ధంగా, అస్పష్టంగా ఉందని, ఇది న్యాయ సమీక్షలో నిలబడే అవకాశం లేదని అబ్దుల్లా చెప్పారు. ఈ ఉద్యోగులకు తాను నిర్దోషినని నిరూపించుకునే హక్కు కూడా ఇవ్వలేదని విమర్శించారు. వీరిలో చాలా మంది న్యాయస్థానాల ద్వారా లభించే ఉపశమనం ఆధారంగా తిరిగి ప్రభుత్వ సేవల్లోకి వస్తారని చెప్పారు. విషయంలో నాకు ఎటువంటి సందేహం లేదు. అత్యంత పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆరు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లతో సహా తన ఎన్నికల హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -