పోలీస్ స్టేషన్ లక్ష్యంగా భారీ బాంబు పేలుడు
15 మంది భద్రతా సిబ్బంది మృతి
ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బన్నూ జిల్లాలోని ఫతేఖేల్ పోలీస్ స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకుని జరిగిన భారీ ఆత్మాహుతి దాడిలో 15 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పాక్‌లోని ఇత్తెహాద్-ఉల్ -ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్టు ప్రకటించింది. పేలుడు ధాటికి సమీపంలోని నివాస గృహాలు కుప్పకూలడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో పోలీస్ స్టేషన్‌ను శనివారం అర్ధరాత్రి ఉగ్రవాదులు పేల్చివేయనున్నారన్న సమాచారంతో అప్రమత్తమైన భద్రతా దళాలు ఆ వాహనాన్ని గుర్తించి, మార్గం మధ్యలోనే ధ్వంసం చేయడంతో భారీ ప్రాణ నష్టం తప్పిందని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ బాంబు దాడుల్లో సుమారు 15మంది మరణించారని, గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆస్పత్రులకు తరలించామని ఉన్నతాధికారులు ఆదివారం తెలిపారు. వాయువ్య పాకిస్థాన్ లోని ఒక పోలీస్ పోస్ట్ వద్ద, ఆ తర్వాత సహాయం అందించేందుకు వెళ్తున్న పోలీస్ సిబ్బంది వాహనంపై మెరుపు దాడులు జరిగాయి. ముందుగా భారీ పేలుడు జరిగిందని, తరువాత ఉగ్రవాదులు పోలీస్ స్టేషన్‌ను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టి కాల్పులు జరిపారని, భద్రతా సిబ్బంది అప్రమత్తమై ప్రతి దాడి చేశారన ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ దాడిని కైబర్ పఖ్తూన్ ముఖ్యమంత్రి ముహ్మద్ సోహైల్ అఫ్రిది తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.“ఉగ్రవాదంపై పోరాటం ఒక ప్రాంతానిది కాదు, ఇది దేశం మొత్తానిది. బలవంతంగా రుద్దిన కొన్ని తప్పుడు విధానాల వల్లే దేశం నేడు అభద్రతా ఊబిలోకి నెట్టిందని” అని ఆయన స్పష్టం చేశారు. ఆత్మాహుతి దాడి తీవ్రతకు పోలీస్ స్టేషన్ పరిసరాల్లోని నివాస గృహాల పైకప్పులు కూలిపోయాయి. స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. ఆ ప్రాంతాన్ని భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకుని గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నారు. ఈ దాడిలో ఉగ్రవాదులు డ్రోన్లను వినియోగించడం గమనార్హం.
పాక్‌లో ఉగ్రదాడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



