నవతెలంగాణ – బజార్ హత్నూర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని స్థానిక తహసిల్దార్ శ్యాంసుందర్ సూచించారు. సోమవారం నుంచి సర్వే ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎన్యుమరేటర్లకు ప్రత్యేకంగా సలహాలు, సూచనలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్యుమరేటర్లు గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందించిన ఫారాల్లో ఉన్న 75 రకాల ప్రశ్నలకు సంబంధించిన వివరాలను పూర్తిస్థాయిలో సేకరించి క్షుణ్ణంగా నమోదు చేయాలని అన్నారు. సర్వేలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాలను సవివరంగా నమోదు చేయాలని సూచించారు. బలహీన వర్గాల అభ్యున్నతికి అవసరమైన ప్రణాళికలను రూపొందించి సమర్థవంతంగా అమలు చేయడంలో ఈ సర్వే కీలకంగా ఉపయోగపడుతుందని తెలిపారు. అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేసి సర్వేను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్యుమరేటర్ల పాల్గొన్నారు.
ప్రతి వివరాన్ని క్షుణ్ణంగా నమోదు చేయాలి: తహసిల్దార్ శ్యాంసుందర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



