నవతెలంగాణ – కొండాపూర్: గంగారం గ్రామంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను స్పెషల్ కమిషనర్ శ్రీలక్ష్మి సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె పని ప్రదేశాలను సందర్శించి, పనుల అమలు విధానం, కార్మికుల హాజరు, పనుల నాణ్యత, మొక్కల సంరక్షణ వంటి అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉపాధి హామీ పనులు ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఆమె సూచించారు. గ్రామస్థులతో మాట్లాడిన అధికారులు, ఉపాధి హామీ పనుల ద్వారా గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరారు. అలాగే పనులను వేగవంతంగా పూర్తి చేసి, ప్రతి కార్మికుడికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పరిశీలనల్లో డిఆర్డిఓ, అడిషనల్ డిఆర్డిఓ, ఏపీడీ, ప్లాంటేషన్ మేనేజర్, ఎంపీడీఓ, గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఉపాధిహామీ పనులను పరిశీలించిన స్పెషల్ కమిషనర్ శ్రీలక్ష్మి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


