Tuesday, May 12, 2026
E-PAPER
Homeజాతీయంమళ్లీ ఇంటి నుంచి పని..!

మళ్లీ ఇంటి నుంచి పని..!

- Advertisement -

టెకీ సంఘాల డిమాండ్‌
న్యూఢిల్లీ : అంతర్జాతీయంగా చమురు ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో దేశీయంగా ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు ఐటి రంగం కీలక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. ఐటి ఉద్యోగులకు ఇంటి నుంచి పని (వర్క్ ఫ్రమ్ హోమ్) ఏర్పాట్లను తప్పనిసరి చేస్తూ అధికారిక అడ్వైజరీని జారీ చేయాలని నాస్కెంట్‌ ఇన్ఫర్మేషన్‌ ‌టెక్నాలజీ ఎంప్లాయిస్‌ ‌సెనట్‌ (‌నైట్స్‌) ‌డిమాండ్‌‌ చేసింది. ఈ విషయమై భారత కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖను కోరింది. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు చమురు వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రధాని మోడీ పిలుపునకు అనుగుణంగా నైట్స్‌ ‌విజ్ఞప్తి చేసింది. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా, సాధ్యమైన చోట ఐటి కంపెనీలన్నీ తమ ఉద్యోగులకు తగిన కాలం పాటు ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటును కల్పించాలని నైట్స్‌ ప్రతిపాదించింది.​గతంలో కోవిడ్-19 సమయంలో దేశవ్యాప్తంగా ఐటి రంగం భారీ స్థాయిలో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అత్యంత విజయవంతంగా అమలు చేసిన విషయాన్ని నైట్స్‌ గుర్తు చేసింది.
ఆ సమయంలో వ్యాపార కొనసాగింపులో ఎలాంటి అంతరాయం లేకుండా పనులు నిర్వహించగలిగామని.. అదే అనుభవంతో ఇప్పుడు చమురు సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి సిద్ధం కావాలని సంస్థ అభిప్రాయపడింది. ప్రభుత్వం ఈ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందిస్తే అటు ఇంధన ఆదాతో పాటు ఇటు ఐటి ఉద్యోగుల ప్రయాణ భారానికి కూడా ఉపశమనం లభిస్తుందని నైట్స్‌ ‌పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -