Tuesday, May 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బండి భగీరథను వెంటనే అరెస్టు చేయాలి

బండి భగీరథను వెంటనే అరెస్టు చేయాలి

- Advertisement -

ప్రజా సంఘాల నాయకుల డిమాండ్
నవతెలంగాణ – మల్హర్ రావు

కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరతను వెంటనే అరెస్టు చేయాలని ప్రజా సంఘాల నాయకులు అక్కల బాపు యాదవ్,పిక కిరణ్ డిమాండ్ చేశారు.మంగళవారం కొయ్యుర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు 17 ఏళ్ల బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాదులోని పేట్ బషీరాబాద్ పోలీసులు భగీరథపై  పోస్కోయాక్టు ప్రకారం కేసు నమోదు చేశారు.కానీ అతన్ని ఇంతవరకు అరెస్టు చేయకపోవడానికి కారణం ఇతడు బిజెపికి చెందిన కేంద్రమంత్రి కొడుకు కావడమేనాని ప్రశ్నించారు.అరెస్టు చేయకపోగా మరోవైపు బాలికతో పాటు ఆమె తల్లిదండ్రులు డబ్బుల కోసం తనను బెదిరిస్తున్నారని శుక్రవారం కరీంనగర్ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంలో ముగ్గురిపై కేసు నమోదైయిందని తెలిపారు.కేంద్రమంత్రి కొడుకును సామాన్యమైన కుటుంబాల వాళ్ళు బెదిరిస్తే వాళ్ళు బెదురుతారా ఇది ఎంత అసహజంగా ఉందని మండిపడ్డారు.బిజెపి మంత్రులు, ఎమ్మెల్యేలకు మహిళలపై అత్యాచారాలు చేయడం,లైంగిక దాడులు చేయడం ఇప్పుడు కొత్త కాదని,వీరి అండ  చూసుకొని వీళ్ళ  కొడుకులు కుటుంబ సభ్యులు ఇటువంటి లైంగిక దాడులు, చేస్తున్నారని ఆరోపించారు.అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేస్తే వారికి శిక్ష ఎక్కువ ఉండాల్సింది పోయి అసలు కేసులో నమోదు కాకుండా అవుతున్నాయని తెలిపారు.ఇప్పటికైనా భగీరథుని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -