- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఉల్లి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ మార్కెట్లో ఒక రైతు 1,262 కిలోల ఉల్లిని కిలోకు ఒక్క రూపాయి చొప్పున విక్రయించి, మొత్తం రూ.1,262 మాత్రమే పొందాడు. అయితే, ఆ ఉల్లిని మార్కెట్‌కు తరలించడానికి లోడింగ్, రవాణా, తూకం కోసం రూ.1,263 ఖర్చు చేశాడు. దీంతో, పంటకు ప్రతిఫలం దక్కకపోగా, అదనంగా ఒక రూపాయి నష్టపోయిన రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.
- Advertisement -



