మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో ఘటన.
ఘటన స్థలికి చేరుకుని విచారణ చేపట్టిన పోలీసులు
హతుడు ఘట్ కేసర్ మండలం అంకుశపూర్ కు చెందిన అన్వర్ గా గుర్తింపు
నవతెలంగాణ – శివంపేట్
మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని శభాష్ పల్లి గ్రామ శివారులో ఒక వ్యక్తి హత్యకు గురైనట్లు బుధవారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. తూప్రాన్ సీఐ వెంకటరాజా గౌడ్, ఎస్ఐ మధుకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ మల్కాజిరి జిల్లా ఘట్ కేసర్ మండలం అంకుషాపూర్ గ్రామానికి చెందిన అన్వర్ (50) ట్రాక్టర్ డ్రైవర్. ఆర్మూర్ జిల్లా బాల్కొండ నుండి ట్రాక్టర్ ను తీసుకొస్తూ శభాష్ పల్లి గ్రామ శివారులోని పోతారం రోడ్డులో దారుణంగా హత్యకాబడినట్లు పోలీసులు ప్రాథమిక అంచనా వేశారు. అన్వర్ ను హత్య చేసి రోడ్డు పక్కనే పడేసిన దుండగులు అన్వర్ తెచ్చిన ట్రాక్టర్ ని దుండగులు ఎట్టుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న తూప్రాన్ సిఐ వెంకటరాజు గౌడ్, ఎస్ఐ మధుకర్ రెడ్డి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే హత్య చేసిన నిందితులను పట్టుకుంటామని సీఐ వెంకటరాజు గౌడ్ తెలిపారు.
ట్రాక్టర్ కోసం డ్రైవర్ ను హత్య చేసిన దుండగులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



